వ‌ర్మ‌తో శ్రీరెడ్డి డేటింగ్ నిజ‌మేనా..?

By Newsmeter.Network  Published on  29 Nov 2019 8:22 AM GMT
వ‌ర్మ‌తో శ్రీరెడ్డి డేటింగ్ నిజ‌మేనా..?

క్యాస్టింగ్ కోచ్ పేరుతో శ్రీరెడ్డి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రికీ ఉన్న పోలిక ఏంటంటే.. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. భ‌యం లేకుండా వీరిద్ద‌రూ.. ఎవ‌రి గురించైనా మాట్లాడ‌గ‌ల‌రని.. ఏమైనా మాట్లాడ‌గ‌ల‌రని టాక్‌.

'వీరిద్ద‌రు డేటింగ్ చేయ‌నున్నారా'..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విషయం ఏంటంటే... శ్రీరెడ్డి తాజాగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రామ్ గోపాల్ వ‌ర్మ‌తో డేటింగ్ చేయాల‌నుకుంటున్నాను అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసింది. అంతే... శ్రీరెడ్డి ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా... ఈ వార్త వైర‌ల్ అయ్యింది. అయితే శ్రీరెడ్డి ఎందుకు వ‌ర్మ‌తో డేటింగ్ చేయాల‌నుకుంటుంది..? అంటూ నెటిజ‌న్లు అడుగుతున్నారు.

ప్ర‌స్తుతం రామ్ గోపాల్ వ‌ర్మ క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమా రిలీజ్ హాడావిడిలో ఉన్నారు. హైకోర్ట్ ఈ మూవీ రిలీజ్ కి బ్రేక్ వేయ‌డంతో వాట్ నెక్ట్స్ అనే ఆలోచ‌న‌తో ఇంకా బాగా మూవీని ప్ర‌మోట్ చేస్తున్నారు. మ‌రి... వ‌ర్మ‌ శ్రీరెడ్డికి ఎస్ చెబుతారా..? నో చెబుతారా..? ఎలా స్పందిస్తారనేది ఆస‌క్తిగా మారింది.

Next Story