వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా శిఖర్ ధావన్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. వెస్టిండీస్‌లో డిసెంబర్ 6 నుండి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సెలక్టర్లు ధావన్ స్థానంలో యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను జ‌ట్టులోకి ఎంపిక చేశారు.

ఇటీవ‌ల‌ బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో స్థానం ద‌క్క‌లేదు. అయితే.. సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ మోకాలికి గాయమవ‌డంతో సంజూ శాంస‌న్ కు మ‌రో మారు అవ‌కాశం త‌లుపుత‌ట్టింది.

విండీస్ తో సిరీస్‌ కోసం టీ20, వన్డే జట్లను ఎంపిక చేశారు. అందులో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే, అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా శిఖర్ ధావన్ గాయం కారణంగా విండిస్‌తో సిరిస్‌కు దూరం కావడంతో సెలక్టర్లు శాంసన్‌ను ఎంపిక చేశారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.