వినియోగదారులను విసిగించే స్పామ్ కాల్స్ ను నిరోధించడంలో భారత్ పాక్షికంగా విజయం సాధించింది. ఎక్కువ స్పామ్ కాల్స్ వచ్చే దేశాల జాబితాలో మన దేశం అయిదు స్థానాలు తగ్గింది. ట్రూకాలర్ నిర్వహించిన వార్సిక సర్వే నివేదిక లో మన దేశంలో స్పామ్ కాల్స్ 16 శాతం తగ్గాయని తేలింది. అయితే ఇప్పటికీ ప్రతి ఫోన్ కీ నెలకు కనీసం 26 స్పామ్ కాల్స్ వస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

స్పామ్ కాల్స్ విషయంలో బ్రెజిల్ తొలి స్థానంలో ఉంది. ఆ దేశంలో మొబైల్ వాడకం దారులకు నెలకు 46 స్పామ్ కాల్స్ వస్తున్నాయి. రెండో స్థానంలో పెరూ 31 కాల్స్ తో, మూడో స్థానంలో ఇండోనీసియా 28 కాల్స్ తో , మెక్సికో 25.7 కాల్స్ తో నాలుగో స్థానంలో ఉన్నాయి. 25.6 స్పామ్ కాల్స్ తో భారత్ అయిదో స్థానంలో ఉంది.

దాదాపు 145 మిలియన్ల వాడకందార్లతో బారత్ ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. ట్రూకాలర్ కి మొత్తం 195 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉండగా అందులో 145 మిలియన్లు భారతీయులే కావడం గమనార్హం. స్పామ్ కాల్స్ లో ఎక్కువగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలనుంచి వస్తాయని కూడా అధ్యయనంలో తేలింది. పది శాతం స్పామ్ కాల్స్ బ్యాంకుల నుంచి, పదిహేడు శాతం ఆర్ధిక సంస్థలనుంచి వస్తాయని అధ్యయనం తెలియచేసింది. మూడు శాం మహిళలకు లైంగిక వేధింపు స్పామ్ కాల్స్, ఎస్ ఎం ఎస్ లు వస్తున్నాయి. ఇదొక ఆందోళనకలిగించే విషయం అని సర్వే పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.