బ్రేకింగ్‌: ఒక్క రోజులోనే 1500 కరోనా కేసులు

By అంజి  Published on  15 March 2020 3:44 AM GMT
బ్రేకింగ్‌: ఒక్క రోజులోనే 1500 కరోనా కేసులు

కరోనా దెబ్బకి స్పెయిన్‌లో లాక్ డౌన్ ప్రకటించారు. గడిచిన 24గంటల్లోనే 1,500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ వైరస్‌ బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. అందులో దాదాపు 3,000 మంది దేశ రాజధాని మాడ్రిడ్‌లోనే ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇక వైరస్‌ బారినపడ్డవారిలో శుక్రవారం వరకు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆ దేశ కాబినెట్‌ అత్యవసరంగా భేటీ అయింది. రెండు వారాల ఆత్యయిక స్థితి ప్రకటించింది. స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తనకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్టు ఆమె తెలిపారు.

కాగా తనను కూడా ఇంటివద్దనే ఉంచి పరిశీలనలో పెట్టినట్టు మంత్రి ఇరేనే భర్త, స్పెయిన్ ఉప ప్రధాని పబ్లో ఇగ్లెసియా ట్విటర్లో తెలిపారు. అతి కొద్ది రోజుల్లోనే స్పెయిన్ యూరోప్ లోని కరోనా తో బాధ పడుతున్న 2 వ దేశంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రజలను అత్యవసర కారణాలప్పుడు తప్ప బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆహార పదార్ధాల కొనుక్కోవడానికి, ఆరోగ్య అవసరాలకి, పెద్దలకి సహాయం చెయ్యడానికి మాత్రమే బయటకి రావచ్చని సూచించింది. స్కూల్స్, రెస్టారెంట్ లు, బార్ లు మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story