ఇదొక శుభపరిణామం: ఎస్పీ చరణ్‌

By సుభాష్
Published on : 29 Aug 2020 2:23 AM

ఇదొక శుభపరిణామం: ఎస్పీ చరణ్‌

కరోనాతో పోరాడుతున్న ప్రముఖ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. బాలు వెంటిలేటర్‌, ఎక్మో సహాయం చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. వైద్యులు అడిగిన దానికి ఆయన స్పందిస్తున్నారని, ఫిజియోథెరఫీ చికిత్స చేస్తున్నామని, వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు బాలు ఆరోగ్య పర్యవేక్షిస్తోందని ఎంజీఎం ఒక హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక మరో వైపు బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. నాన్న ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతోందని తెలిపారు. నిన్నటికంటే ఈ రోజు ఇంకాస్త కోలుకున్నారని, ఇదొక శుభపరిణామం, వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ చరణ్‌ వీడియో సందేశం ద్వారా తెలిపారు.

Next Story