కరోనా బారిన పడి కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగు పడుతోంది. కరోనాతో పోరాడుతున్న ఆయనకు ఇటీవల నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చరణ్ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేస్తున్నారు.