ధోని గురించా.. సారీ..!

By Newsmeter.Network  Published on  18 Jan 2020 11:14 AM GMT
ధోని గురించా.. సారీ..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాలో బీసీసీఐ చోటు ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. ఇక ధోని కెరియ‌ర్ ముగిసింద‌ని, ధోని త‌న రిటైర్‌మెంట్ ను ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని కొంద‌రు వాదిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం ధోని స‌మాధానం కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ దీనిపై స్పందించాల‌ని కోరారు అభిమానులు. ధోనికి కాంట్రాక్టు ఎందుకు ఇవ్వ‌లేద‌ని..? ధోని రిటైర్‌మెంట్ విష‌యం మీకు తెలుసా..? టీమిండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్ లు అందించిన ఆట‌గాడికి ఇచ్చే మ‌ర్యాద ఇదేనా..? అంటూ అభిమానులు గంగూలీకి ప్రశ్న‌ల వ‌ర్షం కురిపించారు. అయితే దాదా మాత్రం ఈ ప్ర‌శ్న‌లంనింటికి స‌మాధానాలు దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌ర‌గా ఈ అంశం పై తానూ మాట్లాడేది ఏది లేద‌న్నాడు. ధోనిని సాగ‌నంపేందుకు సాగనంపడానికి బ్యాకెండ్‌లో బాగానే వర్క్‌ జరిగనట్టుందని క్రీడా విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మ‌హేంద్రుడు గ‌తంలో ఓ సారి త‌న రిటైర్‌మెంట్ పై స్పందిస్తూ జ‌న‌వ‌రి వ‌ర‌కు త‌న‌ను ఎవ‌రు ఏమీ అడ‌గ‌వ‌ద్ద‌ని, ఐపీఎల్ త‌రువాత త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇటీవ‌ల హ‌ర్భ‌జ‌న్ సింగ్ మాట్లాడుతూ ధోనిని ఇక టీమిండియా జెర్సీలో చూసే అవ‌కాశ‌మే లేద‌న్నాడు. ఐపీఎల్‌లో ధోని అద్భుతంగా ఆడటం పక్కా అని ఎందుకంటే మ‌హీ ఆడే ప్రతీ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలనుకుంటాడని చెప్పాడు.

ఐపీఎల్ లో ధోని అద్భుతంగా రాణించి టీ20వ‌ర‌ల్డ్ క‌ప్ లో చోటు ద‌క్కించుకుంటాడ‌ని మ‌హీ అభిమానులు అంటున్నారు.

Next Story
Share it