బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటే ఒప్పుకోం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sep 2019 11:37 AM GMT
రియాద్ :ఆయిల్ తో ఆ దేశాల స్వరూపమే మారిపోయింది. వారి ఆర్ధిక వ్యవస్థలు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. అయితే..తమ ఆర్ధిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు నింపడానికి సౌది విదేశీయులకు టూరిస్ట్ వీసాలు జారి చేయాలని నిర్ణయించుకుంది. దీంతో..తమ దేశ సంప్రదాయ, ఆచారాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి విదేశీ టూరిస్ట్‌లు పాటించాల్సిన రూల్స్‌ను తయారు చేయడంలో సౌది అధికారులు బిజీగా ఉన్నారు. 49దేశాలకు సౌదీ టూరిస్ట్ వీసా జారీ చేయనుంది. దీనిలో అమెరికా, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. సౌదీలో పర్యటించే విదేశీయులు ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని 19 నిబంధనలను రూపొందించింది. మహిళలు భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం కుదరదు.
Next Story