సముద్రం ఒడ్డుకు 500 కిలోల సోర చేప

By సుభాష్  Published on  22 Feb 2020 3:43 AM GMT
సముద్రం ఒడ్డుకు 500 కిలోల సోర చేప

సామాన్యంగా చేపలు అనేవి పది, ఇరవై కేజీలు ఉంటాయి. మహాఅయితే యాభై, వంద కేజీల బరువు కలిగి ఉంటాయి. కొన్ని కొన్ని చేపలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వాటి బరువు చూస్తేనే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓ సోర చేప ఏకంగా 500కిలోలు ఉండటం చూసి జనాలు భారీగా తరలివచ్చారు. శ్రీకాకులం జిల్లాలో మత్స్యకారులకు ఈ భారీ చేప చిక్కింది.

రణస్థలం మండలం జీరుపాలెం పంచాయతీ పరిధిలో జగన్నాథపురం గ్రామంలో ఓ భారీ సోర చేప సముద్రం తీరానికి కొట్టకువచ్చింది. ఈ చేప సుమారు 10 అడుగుల పొడవు, 500 కిలోలపైనే బరువు ఉంటుందని మత్స్య కారులు తెలిపారు. సముద్ర తీరానికి వచ్చేసరికి ఇది చనిపోయి ఉండటంతో దానికి తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చారు. ఇలాంటి సోర చేపలు ఇంత బరువు ఉండటం చాలా అరుదు అని మత్స్యకారులు చెబుతున్నారు.

Next Story