హీరో సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ రిలీజ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 6:37 AM GMT
హీరో సునీల్ చేతుల మీదుగా అప్పుడు- ఇప్పుడు సినిమా సాంగ్ రిలీజ్‌

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం 'అప్పుడు- ఇప్పుడు'. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా.. చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన ఫస్ట్ లుక్‌కి, కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా మొదటి పాటకి విడుదలైన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు చేతుల‌మీదుగా విడుదలైన రెండవ పాటకి అద్భుతమైన స్పంద‌న వ‌స్తోంది. కాగా ఈ చిత్రంలోని మూడవ పాటను హీరో సునీల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ..

"అప్పుడు - ఇప్పుడు' టైటిల్ చాలా క్యాచీగా ఉందన్నారు. అలాగే పద్మానావ్ భరద్వాజ్ సంగీతం కొత్తగా ఉందన్నారు. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..

" తెలుగు సినిమా ప్రేక్షకులని తనదైన హాస్యంతో సునీల్‌ నవ్వించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తన నటనతో, డాన్స్ లతో హీరోగా హిట్ సినిమాలు అందిస్తున్న హీరో సునీల్ చేతుల మీద ' అప్పడు-ఇప్పుడు' సినిమా పాట విడుదలవడం మాకు చాలా ఆనందంగా ఉంది "అన్నారు.

Next Story
Share it