ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పది మందిని పొట్టనపెట్టుకున్నారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మొగదిషులోని ఓ హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్‌- షబాబ్‌ సంస్థ ఉగ్రవాదులు ఆదివారం జరిపిన దాడిలో 10 మంది మృతి చెందగా, చాలా మంది వరకు గాయపడ్డారు. ఉగ్రవాదులు ముందుగా హోటల్‌ ముందు కారుబాంబును పేల్చారు. అనంతరం హోటల్‌ లోపలికి చొరబడి హోటల్‌లో బస చేసిన వారిని బందీలుగా పట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హోటల్‌ చుట్టుముట్టారు. భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు మృతి చెందారు.

ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నవారు ఎక్కువగా యువకులు, మహిళలే ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అర్థరాత్రి వరకకు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ దాడిలో గాయపడిన వారు దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, ముగ్గురు హోటల్‌ భద్రతా సిబ్బంది, పౌరులున్నట్లు ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా సమాచారం.

అయితే హోటల్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు జరిపిన దాడిలో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ దాడిలో దాదాపు 17 మంది వరకు చనియి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.