అంబ‌ర్ పేట్‌కు చెందిన సుకీత్.. 5 సంవత్సరాల క్రితం కార్వాన్ ప్రాంతానికి చెందిన శివానిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరిద్ద‌రూ వృత్తిరీత్యా సాప్ట్‌వేర్ ఉద్యోగులు. మంచి జీతం.. మాంచి జీవితం. చ‌క్క‌గా సాగిపోతున్న వారి సంసారంలో అక్ర‌మ సంబంధం చిచ్చు రేపింది.

అయితే.. సుకీత్ వేరే అమ్మాయితో అక్ర‌మ సంబంధం పెట్టుకోవ‌డ‌మే కాక.. కొన్ని సంవత్సరాలుగా శివానిని చ‌నిపోవాల‌ని వేధించసాగాడు. గత ఆరు నెలల నుండి సుకీత్.. శివానిని మరింతగా వేధించ‌డంతో నిన్న రాత్రి అంబర్‌పేట్ నివాసంలో ఉరివేసుకుంది.

ఇదిలావుంటే.. త‌న‌కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందనీ.. న‌న్ను చనిపోవాలని.. త‌ను వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేస్తున్నాడ‌ని సుకీత్ విష‌య‌మై ఈ మధ్యనే శివాని త‌మ‌తో కూడా మాట్లాడింద‌ని కుటుంబ స‌భ్యులు వాపోతున్నారు.

కాగా, నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుందని శివాని కుటుంబ సభ్యులకు సుకీత్ కుటుంబ సభ్యులు స‌మాచారం ఇచ్చారు. అయితే.. నిన్న రాత్రి 8గంటల 45నిమిషాలకు తన సోదరితో మాట్లాడిన శివాని.. షాపింగ్ చేసి అమ్మకు చీర కొంటానని చెప్పింద‌ని.. సంతోషంగా ఫోన్ లో మాట్లాడిన గంటకే ఉరి వేసుకుందని ఫోన్ రావ‌డంతో శివాని కుటుంబసభ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఉరి వేసుకోవడానికి సరిపోయేలా ఇంటి పైకప్పు లేదని.. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ లో సుకీత్.. అత‌ని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.