మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మదినగూడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉండే మహితి(28).. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ అయిదవ అంతస్థుపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు టీసీఎస్ లో హెచ్ఆర్ గా పని పనిచేస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story