మా అమ్మను రక్షించండి.. మంత్రి కేటీఆర్‌ కు యువతి ట్వీట్‌

By Newsmeter.Network  Published on  2 Feb 2020 6:52 AM GMT
మా అమ్మను రక్షించండి.. మంత్రి కేటీఆర్‌ కు యువతి ట్వీట్‌

సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు మంత్రి కేటీఆర్‌. కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోసం మంత్రి కేటీఆర్‌ కు ట్వీట్‌ చేస్తే సత్వరం స్పందించి వారికి సాయం చేస్తుంటారు. హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గరిమా అనే యువతి తన తల్లి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్‌ కు ట్వీట్‌ చేశారు. బిహార్ తూర్పు చంపారన్ జిల్లా రక్షాహుల్ ప్రాంతంలో కిడ్నాప్‌ కు గురైన తన తల్లిని రక్షించాలని కోరారు.

గరిమ ట్వీట్‌ కు మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. ఆమె తల్లిని కాపాడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ డీజీపీకి ఈ విషయం తెలియజేసి, బిహార్ డీజీపీని సంప్రదించి, ఆమె తల్లి ఆచూకీ కనుగొనాలని సూచించారు. వెంటనే ఆయన బిహార్ డీజీపీకి ఈ సమాచారం చేరవేశారు. గరిమ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించి తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.Next Story