సుడిగాలి సుధీర్‌లో అంత సీన్ ఉందా..?

By Newsmeter.Network  Published on  27 Nov 2019 10:37 AM GMT
సుడిగాలి సుధీర్‌లో అంత సీన్ ఉందా..?

సుడిగాలి సుధీర్‌ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా రూపొందుతోన్న సినిమా 'సాప్ట్ వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్‌ రాజు పాల్గొన్నారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...

భారీ తారాగ‌ణంతో ఈ సినిమాని తీశారని సమాచారం. ఇంకా చెప్పాలంటే.. సుధీర్ హీరోగా కామెడీ సినిమా కాకుండా భారీ యాక్ష‌న్ ఫిల్మ్ తీసారేంటి అనే ప్ర‌శ్న కూడా వ‌స్తుంది.అయితే సుధీర్ మాత్రం ఖ‌చ్చితంగా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుందని.. విజ‌యాన్ని అందిస్తుందని ఘట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం. మ‌రి.. కామెడీ సినిమా కాకుండా యాక్ష‌న్ ఫిల్మ్ చేసేంత సీన్ సుధీర్ లో ఉందా..? లేదా..? అనేది ఈ సినిమా చూసిన త‌ర్వాత తెలుస్తోంది.

Next Story
Share it