సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కీలక నిర్ణయం

By Newsmeter.Network  Published on  13 May 2020 11:16 AM GMT
సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ లాక్‌డౌనే మార్గంగా భావించి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. భారత్‌లోనూ నెలన్నరగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. చిన్న, పెద్ద సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం చేసుకొనేలా అవకాశం కల్పించాయి. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read :203 జీవో ప్రగతి భవన్‌లోనే సిద్ధమైంది – రేవంత్‌రెడ్డి

ఉద్యోగులకు ఇంటినుండే శాశ్వతంగా పనిచేసుకునేందుకు అనుమతిస్తామని ట్విట్టర్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో సెప్టెంబర్‌ లోగా తమ ఆఫీస్‌లు తెరిచేందుకు వీలులేదని, తమ ఉద్యోగులను ఎక్కడి నుంచైనా పనిచేసుకునేలా వీలు కల్పించామని ట్విట్టర్‌ ప్రతినిధి తెలిపారు. కార్యాలయాలు ఎప్పుడు తెరిచినా.. ఉద్యోగులు ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడు ఆఫీస్‌ వారిదే అవుతుందని తెలిపారు. గడిచిన కొన్ని నెలలుగా ఇంటి నుంచి కూడా పనిచేయొచ్చని రుజువుచేశారని, శాశ్వతంగా ఇంటివద్దనే పనిచేస్తామంటే అలాకూడా మేము అనుమతిస్తామని ట్విట్టర్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

Next Story