స్నేహారెడ్డికి బ‌న్నీ క్యూట్ విషెస్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 12:07 PM GMT
స్నేహారెడ్డికి బ‌న్నీ క్యూట్ విషెస్..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి గుర్తుంది క‌దండీ.. అదేనండి స్నేహారెడ్డి. ఆదివారం స్నేహారెడ్డి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు బన్నీ ఇన్‌స్టాగ్రామ్ లో విషెస్ చెప్పారు. చాలా సింపుల్‌గా.. ‘‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యను హత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. అయితే త‌మ అభిమాన హీరో చేసిన ఆ ఫోటోకు గంట‌లోనే ల‌క్ష‌ల్లో లైకులు, కామెంట్స్ వ‌చ్చాయి. కాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది.

Next Story
Share it