ముఖ్యాంశాలు

  • రెండో టీ20లో పాక్ పై ఆసీస్ విజయం
  • చెలరేగిన స్మిత్, 51 బంతుల్లో 80 పరుగులు
  • స్టార్ బ్యాట్స్ మెన్ , ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లకు ఎంపికైన స్మిత్

కాన్ బెర్రా:పాక్ ఆట తీరు మారలేదు. నాయకుడు మారినా ..ఆట అంతే ఉంది. కాన్‌బెర్రాలో జరిగిన టీ20లో పాక్ చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అయింది. స్మిత్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో రెండో టీ20లో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘన విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్ 1-0లోకి దూసుకెళ్లింది.

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ దారి పట్టారు, బాబర్ అజమ్ ఒక్కడే 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇఫ్లీకర్‌ అహ్మద్ కూడా 34 బంతుల్లో 64 పరుగులు చేసి పాక్‌ స్కోర్‌కు సహాయపడ్డాడు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. స్మిత్ 51 బంతుల్లో 80 పరుగులతో చెలరేగిపోయాడు. 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాట్స్‌మెన్, ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ కూడా స్మిత్ కే లభించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.