ఆ బుడతడు ఇంకా చెడ్డీల‌ స్టేజ్ లోనే ఉన్నాడు.. కానీ వాడు క్రికెట్ ఆడే స్టైల్లో మాత్రం డివిల్లీయ‌ర్స్ ను మించిపోయాడు. ఆ చిచ్చ‌ర‌పిడుగు ఆట గురించి ఎంత మాట్లాడిన త‌క్కువే.. ప‌వ‌ర్ హిట్టింగ్ కు దిగిన సెహ్వాగ్ లా.. పాకిస్థాన్ పై విరుచుకుప‌డే స‌చిన్.. కోహ్లీలా క‌న‌ప‌డుతున్నాడు. పుట్‌వ‌ర్క్‌లో ద్రావిడ్ నే మించిలావున్నాడు. కేవ‌లం 39సెక‌న్ల నిడివి ఓ వీడియోలో ఆ బుడ‌త‌డి ఆట‌తీరును చూస్తే ఇవ‌న్ని నిజ‌మేన‌ని మీరూ కూడా ముక్కున వేలు వేసుకుంటారంటే ఇందులో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. ఈ చిన్న వీడియోలోనే బుడ‌త‌డు క‌వ‌ర్ డ్రైవ్, స్ట్రైయిట్ డ్రైవ్‌ల‌తో విరుచుకుప‌డుతున్నాడంటే.. వీడు ఎదిగేకొద్ది ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కోడ‌తాడో అని నెటిజ‌న్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Future Sehwag

ఒక రూమ్‌లో క్రికెట్‌ షాట్లు ప్రాక్టీస్‌ చేస్తున్న బుడతడి వీడియోకు దిగ్గజ క్రికెటర్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ముగ్థుడైపోయాడు. మొత్తం బ్యాటింగ్‌ను ఒడిసి పట్టేసుకున్నాడా అంటూ కొనియాడాడు. ఈ బుడతడు బహుశా ఇంగ్లండ్‌ గడ్డపైనే పుట్టి ఉంటాడంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

ఇక‌ నెటిజన్లు సైతం బుడ‌త‌డిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. స్టీవ్‌ స్మిత్‌ను తలపిస్తున్నాడని కొంద‌రు.. షాట్ల ఎంపికలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పోలికలు ఉన్నాయని కొందరు ప్రశంసించారు. ఆ బుడతడిని ఎదుర్కోవాలంటే.. బౌల‌ర్లు ఇక బౌన్సర్లే వేయాలని కొంద‌రూ పొగుడుతున్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.