మనిషి లావవడానికి నిద్రకు సంబంధం ఉందా?

By సుభాష్  Published on  25 March 2020 12:29 PM GMT
మనిషి లావవడానికి నిద్రకు సంబంధం ఉందా?

జీవితంలో మనిషికి నిద్ర తప్పని సరి. నిద్ర సరిగ్గాలేకపోతే ఎన్నో సమస్యలు దరి చేరుతాయి. ఈ విషయంపై వైద్య నిపుణులో ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నిత్య జీవితంలో అనారోగ్య సమస్యల గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. కనీసం రోజుకు ఎనిమిది గంటలైన నిద్రలేకపోతే దాని ప్రభావం అంతా ఇంతా కాదు.

రాత్రి సమయంలో నిద్ర పోకపోతే ఒబిసిటీ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు గుండె సమస్యలతో పాటు మధుమేహం కూడా దరిచేరుతాయని చెబుతున్నారు. అలాగే మనిషి లావవడానికి నిద్రకు సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక పోకడల కారణంగా సిటీ జీవితానికి అలవాటుపడి అర్ధరాత్రులు మేల్కొంటూ కార్యాలయాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. రాత్రిపూట కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు, సిటీ కల్చర్, ట్రెండ్ పేరు చెప్పుకుంటూ నిద్రను చెడగొట్టుకునే వారి సంఖ్య కూడా అమాంతంగా పెరుగుతోంది.

లేట్ నైట్ పబ్‌లతో, ఫేస్ బుక్ చాటింగ్‌లతో నైట్ మొత్తం నిద్రపోకుండా గడిపేస్తున్నారు. ఈ పద్ధతే ఆరోగ్యానికి కీడు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Next Story