బ్రేకింగ్‌: మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

By సుభాష్  Published on  9 April 2020 7:10 AM GMT
బ్రేకింగ్‌: మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

తెలంగాణలోని సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (69)గురువారం మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య కన్నుమూశారు.

సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పపై విజయం సాధించారు. దీంతో తొలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు రాజీనామా చేయడంతో 2010లో ఉప ఎన్నికలు జరిగాయి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సమయ్య పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నుంచి సమ్మయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసిన కోనేటి కోనప్ప విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో కావేటి సమ్మయ్యకు టికెట్‌ దక్కలేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కావేటి కీలక పాత్ర పోషించారు.

Next Story
Share it