ఎల్.ఎఫ్.జె.సి. లో ఉండగానే కోరస్ లు పాడడానికి వెళ్లే దానినని.. ట్రాక్ సింగర్ గా కూడా పాడేదాన్ని ప్ర‌ముఖ నేఫ‌థ్య గాయ‌ని గీతామాధురి అన్నారు. ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదని ఆమె అన్నారు. కీరవాణి ఖతర్నాక్ సినిమాలో ‘అబ్బో వాడేంటో’ పాట పాడించారని.. ఆ తర్వాత ‘ప్రేమ లేఖ రాశా’ సినిమాలో మరో రెండు పాటలు పాడానని తెలిపారు గీతా మాధురి. అలా పాడుతూ ఉండగా చిరుత సినిమాలో ‘చమ్కా.. చమ్కా..’ అనే పాట పాడానని అది మంచి పేరు తీసుకుని వచ్చిందని అన్నారు. 2008 లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద వచ్చిన ‘నచ్చావులే’ సినిమాలో పాడిన ‘నిన్నే నిన్నే’ మెలోడీ సాంగ్ కు నంది అవార్డు వచ్చిందని తెలిపారు. మగధీర, బాహుబలి లాంటి గొప్ప సినిమాల్లో కూడా పాటలు పాడానని.. అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడుతూ వస్తున్నానని చెప్పారు. ఇలా తన లైఫ్ కొనసాగుతూ ఉన్నప్పుడు 2012 లో నందు పరిచయమయ్యాడని.. ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందని చెప్పుకొచ్చారు గీతా మాధురి. తమకు ఇప్పుడొక కూతురని.. తన పేరు దాక్షాయణి ప్రకృతి అని తెలిపారు.

G2

లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్(ఎల్.ఎఫ్.జె.సి.), హైదరాబాద్ ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదపడింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఎంతో మంది.. ఎన్నో రంగాల్లో టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం వారందిరికి సంబంధించిన విషయాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని ఎల్.ఎఫ్.జె.సి. లెక్చరర్ బాల మారమ్ రెడ్డి సంకల్పించారు. ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి కూడా ఆయన శిష్యురాలే.. కాలేజీతో ఆమెకు ఉన్న అనుబంధం, కాలేజీ లో చేసిన అల్లర్లు ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు.

G3

గీత మాధురి కాలేజీ లైఫ్ ఎలా ఉండేది అన్నది చాలా మందికి తెలీదు. ఆ విషయాలన్నింటినీ బాల మారమ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ నంది అవార్డును గెలవడమే కాకుండా నందును కూడా గెలుచుకుందని చెప్పుకొచ్చారు. ఈ మాట నందు వింటే చాలా ఆనందిస్తాడని గీతా మాధురి నవ్వుతూ చెప్పారు.

చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ ఇతర ప్రాంతాల వారితో ఎలా మాట్లాడాలి లాంటి విషయాలన్నింటినీ ఎల్.ఎఫ్.జె.సి. లోనే నేర్చుకున్నామని తెలిపారు గీతా మాధురి. కాలేజీతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని.. మళ్ళీ ఒకసారి కాలేజీకి వెళ్తే బాగుండాలని అనిపిస్తూ ఉంటుందని తెలిపారు గీతామాధురి.

G1

చెప్తే చేయాలి.. చేసేశాక చెప్పుకోవద్దు అనే సిద్ధాంతాన్ని తాను బాగా నమ్ముతానని గీతా మాధురి తెలిపారు. మంచి సింగర్స్ గా కావాలని అనుకున్న వాళ్లకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు గీతా మాధురి. సహనం అన్నది సక్సెస్ మంత్రమని తాను నమ్ముతానని.. చాలా మంది దీన్ని అలవర్చుకుంటే ఖచ్చితంగా ఎదుగుతారని గీతా మాధురి అన్నారు. ఫేమ్ వచ్చే ప్రోగ్రామ్ లలో మాత్రమే తమ పిల్లలను పాడించాలి అని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారని.. కానీ వేరే ప్రోగ్రామ్ లలో పాడిస్తే పిల్లలు నేర్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

G5

ఇక లైవ్ లో ఉన్న ఎల్.ఎఫ్.జె.సి. అల్యుమినీస్ కోసం మరికొన్ని పాటలు పాడారు గీతా మాధురి. ఇక బాల మారమ్ రెడ్డి ఇచ్చిన ఫ్లూట్ ట్యూన్ ను పాడి వినిపించారు గీతా మాధురి. గీతా మాధురి ‘నిన్నే నిన్నే’ పాట పాడుతూ ఉండగా.. బాల మారమ్ రెడ్డి తన ఫ్లూట్ ట్యాలెంట్ ను కూడా చూపించారు. వె వేల గోపెమ్మలా అంటూ బాల మారమ్ రెడ్డి ఫ్లూట్ ను వాయించగా.. గీతా మాధురి గెస్ చేసి లిరిక్స్ ను కూడా పాడారు. ఇంకొంత మంది అడిగిన ప్రశ్నలకు కూడా గీతా మాధురి సమాధానం చెప్పారు.

Bala Maram Reddy

This is Bala Maram Reddy, Math instructor ,currently working in Georgia Military College, GA.USA. I have started LfJC global students group to bring all my students under one platform. To take this to next level, we have started a web series called LFJC memories featuring all my celebrity students.