కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు కొనసాగుతోంది. ఈ ప్రాణాంతకమైన వైరస్‌ కారణంగా షట్‌డౌన్‌ ప్రకటించిన దేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. ఈ నెల 7వ తేదీ నుంచి నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా షట్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు సింగపూర్‌ ప్రధాని లీ హసీన్‌ లూంగ్‌ ప్రకటించారు.

అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆహార తయీరీ సంస్థలు, సూపర్‌ మార్కెట్లు, ఆస్పత్రులు, రవాణా, బ్యాంకింగ్‌ సర్వీసులు తదితర సేవలన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. వైరస్‌ను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కాగా, సింగపూర్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోగా, ఐదుగురు మరణించారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏ దేశంలో చూసినా కరోనా తప్ప మరేది వినిపించడంలేదు. కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఎంతో మంది ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.