రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటుడు 'సిద్ధార్థ్‌'

By సుభాష్  Published on  29 Dec 2019 11:30 AM GMT
రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటుడు సిద్ధార్థ్‌

సినీనటుడు సిద్ధార్ధ్‌ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వస్తున్న పుకార్లపై స్పందించారు. రాజకీయ నాయకుడిగా రావాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఇలాంటి వార్తలపై నమ్మవద్దని పేర్కొన్నారు. తనలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండేలేరని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో వస్తే చాలా విషయాలు తెలిసి ఉండాలని, అంతేకాకుండా ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలన్నారు.

సమాజంలో ఎదురయ్యే సమస్యల, జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తనవాణిని వినిపిస్తుంటారు సిద్ధార్థ్. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు తన అభిప్రాయాలు మాత్రమేనని, అంతకు మించి మారేమి లేదని స్పష్టం చేశారు. తనకు నిజం మాట్లాడడమే తెలుసని, సమస్యలపై స్పందించకపోతే తప్పు చేసినట్టు భావిస్తానని అన్నారు. సిద్ధార్థ్‌ తాజా వ్యాఖ్యలతో రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ప్రస్తుతం ఆయన టక్కర్‌ సినిమాలో విభిన్నపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Next Story