హైదరాబాద్‌: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ దేవధర్‌ ట్రోఫీలో అరుదైన రికార్డును సాధించాడు. పదేళ్ల క్రితం నాటి విరాట్‌ కోహ్లీ రికార్డును శుభ్‌మన్‌ గిల్‌ తిరగరాసాడు. రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో 47వ దేవధర్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా-సి, ఇండియా బి జట్లు తలపడ్డాయి. దేవధర్‌ ట్రోఫీలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడిగా శుభ్‌మన్‌ గిల్‌ నిలిచాడు. ప్రస్తుతం గిల్‌ వయసు 20 ఏళ్లు. 2009-2010లో ఈ నార్త్‌జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ కోహ్లీ పేరిట ఈ రికార్డు ఉండేది. 2009లో విరాట్‌ కోహ్లీ వయస్సు 21 ఏళ్లు. ఈ ట్రోఫిలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు చేసి ఔట్‌ అయ్యాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.