అమరావతి: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులు సీజ్ చేశారు.కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం కూడా అధికారులు గుర్తించారు దీంతో…23 బస్సులను సీజ్ చేసినట్టు RTA అధికారుల ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేశారు. దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెప్పారు. అందులో భాగంగానే తనిఖీలు చేశామన్నారు. విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ ప్రసాద్ రావు వెల్లడించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.