ముఖ్యాంశాలు

  • యువరాజ్ లాగే స్ట్రోక్ ప్లేయర్ , ఆల్ రౌండర్
  • శివం దూబే నెట్ ప్రాక్టీస్ వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ

ఢిల్లీ:భారత క్రికెట్ కు యువరాజుకు విడదీయరాని బంధం. తన స్ట్రోక్స్ తోనే కాదు..ఫీల్డింగ్, బౌలింగ్ తో టీమిండియాకు అనేక విజయాలు సాధించి పెట్టాడు. యువరాజ్ క్రీజ్ లో ఉన్నాడంటే సగటు క్రికెట్ అభిమానికి మ్యాచ్ గెలుపుపై భరోసా. కొన్ని నెలల క్రితం క్రికెట్ కు యువరాజు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు విదేశీ లీగ్ ల్లో ఆడుతున్నాడు. అయితే…యువరాజ్ లేని లోటు టీమ్ లో కనిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు శివం దూబే రూపంలో టీమిండియాకు మరో యువరాజు దొరికాడు. యువరాజ్ లాగే శివం దూబే కూడా స్ట్రోక్ ప్లేయర్. దేశవాళి క్రికెట్ లో వరుసుగా ఆరు సిక్స్ లు కొట్టి వెలుగులోకి వచ్చాడు శివం దూబే. శివం దూబే వయసు 26 ఏళ్లు. ముంబై ఆల్ రౌండర్. బంగ్లాదేశ్ టీ 20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. తానేంటో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా శివం దూబే నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

4 comments on "మరో ‘యువరాజ్’ దొరికాడు..!"

Comments are closed.