చెన్నై: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివప్రసాద్ ప్రాణాలు వదిలారు. ఆయనను బతికించడానికి అపోలో వైద్యులు చివరి దాకా ప్రయత్నించారు. శివప్రసాద్ మృతితో ఆయన కుటుంబం దుంఖః సాగరంలో మునిగిపోయింది. శివ ప్రసాద్ మరణం చిత్తూరు జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. నిన్ననే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ..శివప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శివప్రసాద్ రాజకీయంగానే కాక..సినీ రంగంలో కూడా తన ప్రతిభను చూపించారు. ప్రజాసేవలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ..తనకు ఎంతో ఇష్టమైన కళారంగంలో కూడా రాణించారు. ఇక…నిరసనలు తెలియజేయడంలో శివప్రసాద్ శైలే వేరు. ఏపీ విభజన సమయంలో, హోదా ఉద్యమ సమయంలో ఆయన రోజుకో వేషంతో పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసన తెలియజేసేవారు. తన వేషాలతో దేశంలోని ఎంపీలందరికీ శివప్రసాద్
సుపరిచితుడయ్యారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.