తల్లైన శిల్పా శెట్టి..!

By రాణి  Published on  22 Feb 2020 8:20 AM GMT
తల్లైన శిల్పా శెట్టి..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా సోషల్ మీడియాలో తమ ఇంట్లోకి మరో చిన్నారి వచ్చిందని.. మా కుటుంబం పరిపూర్ణమైందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. పండంటి ఆడబిడ్డకు తల్లైన శిల్పా శెట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతులకు ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆడ పిల్లకు మాత్రం సరోగసీ (అద్దె గర్భం) ద్వారా రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు తల్లిదండ్రులయ్యారు. సమీషా శెట్టి కుంద్రా ఫిబ్రవరి 15న జన్మించింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆమె తమ అభిమానులతో పంచుకుంది.

తన కుమార్తె చేతి వేళ్ళను పట్టుకుని ఉన్న ఫోటోను పోస్టు చేసిన శిల్పా శెట్టి.. ఇన్నాళ్ల మా ప్రార్థనలు ఫలించి, ప్రతిగా ఓ అద్భుతం జరిగిందని అన్నారు. 'లిటిల్ ఏంజెల్' మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌ గా అనిపిస్తోంది. పేరు సమిశ శెట్టి కుంద్రా అని తెలిపింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయేలా జూనియర్‌ 'ఎస్‌ఎస్‌కే' వచ్చేసింది అని చెప్పింది. 'స' అంటే సంస్కృతంలో కలిగి ఉండటం. 'మిశ' అంటే రష్యన్‌ భాషలో దేవత. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసిన మహాలక్ష్మి సమిశ అని.. తనకు మీ ఆశీర్వాదాలు కావాలి అని ఆమె కోరారు.

శిల్పా శెట్టి సినిమాల నుండి విరామం తీసుకుని దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. చాలా రోజుల తర్వాత ఆమె తిరిగి నటించడం మొదలుపెట్టింది. షబ్బీర్ ఖాన్ 'నికమ్మా' సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రియదర్శన్ 'హంగామా 2' లో కూడా నటిస్తున్నట్లు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. శిల్పా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. టీవీ రియాలిటీ షోలకు జడ్జ్ లా వ్యవహరిస్తూ ఉంది.

తమ ఇంట్లోకి సమిశ వచ్చే ముందు చాలా రోజుల వరకూ ఆమె కోసం ప్రత్యేకంగా రూమ్ ను డెకరేట్ చేయడానికి సమయాన్ని కేటాయించానని శిల్పా శెట్టి చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు అవ్వడం అన్నది దేవుడి ఆశీర్వాదం అని.. ఇక అమ్మాయి పుట్టడం అన్నది చాలా గొప్ప విషయం అని శిల్పా అన్నారు. రాజ్ కుంద్రా చాలా మంచి తండ్రి అని.. తమ జంట పిల్లలను బాగా చూసుకునే తల్లిదండ్రుల లిస్టులో ఉంటుందని అన్నారు. ఇక తమ మొదటి సంతానం అయిన వియాన్ కూడా చెల్లెలు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడని.. గత మూడేళ్లుగా షిరిడి సాయి నాథున్ని తనకు చెల్లెలు కావాలంటూ కోరేవాడని శిల్పా అన్నారు. దేవుడు తమ పూజలను ఆలకించాడని.. అందుకే మహాలక్ష్మి మా ఇంటికి వచ్చేదని సంతోషాన్ని వ్యక్తం చేశారు.



Next Story