శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

By Newsmeter.Network  Published on  19 Jan 2020 10:29 AM IST
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కోండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై ఆగి వున్నలారీని మారుతి స్వీఫ్ట్ కారు ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్నవారిలో ఒక‌రు మృతి చెంద‌గా న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గచ్చిబౌలి నుండి పెద్ద అంబర్ పేట్‌ వెలుతుండగా ప్రమాదం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Next Story