చెప్పులు తీసి మ‌రీ.. బాలీవుడ్ హీరోను ఉరికెత్తించింది..!

By Newsmeter.Network  Published on  31 Dec 2019 2:51 AM GMT
చెప్పులు తీసి మ‌రీ.. బాలీవుడ్ హీరోను ఉరికెత్తించింది..!

ఏంటో ఈ సినిమా వాళ్లు. నిజ జీవితానికి, స్ర్కీన్‌పై షోకు చాలా తేడా ఉందిరా నాయ‌నా..! అని ఎంత మొత్తుకున్నా విన‌రాయే. ఇప్పుడు చూడు ఏం జ‌రిగిందో. మ‌న హీరోనేమో అచ్చం సినిమా సీన్ మాదిరి షో చేద్దామ‌ని అనుకున్నాడా.. అక్క‌డేమో అది బెడిసికొట్టిందాయే. తాను బెదిరిద్దామ‌నుకున్న లేడీ ఒక్క‌సారిగా పంజా విసిరిన పులిలా ఎదురు తిరిగింది.

అంతేకాకుండా, హీరోను వేటాడే ముందు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు తాను వేసుకున్న చెప్పుల‌ను కూడా తీసి ప‌క్క‌న పెట్టేసింది ఆ లేడీ. ఆ స‌మ‌యంలో ఆ హీరో ముఖ క‌వ‌ళిక‌లు చూడాలి. అప్ప‌టి వ‌ర‌కు అప్పుడే ఫ్రిజ్‌లో నుంచి తీసిన యాపిల్ పండులా ఉన్న అత‌ని ఫేస్ క‌ట్ కాస్తా.. ఆ లేడీని గెలికిన త‌రువాత భ‌యానికి.. ఆందోళ‌న‌కు మ‌ధ్య దీనంగా మారింది.

కాగా, ఇటీవ‌ల ప్ర‌ముఖ హిందీ ఛానెల్ స్టార్ ప్ల‌స్ సినీ తార‌ల అవార్డుల కార్య‌క్రమాన్ని నిర్వ‌హించింది. ఆ కార్య‌క్ర‌మ వేదిక‌పైనే ఇదంతా చోటు చేసుకుంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రు..? లేడీ ఎదురు తిర‌గాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చింది..? ఇంత‌కీ ఆ సీన్ ఏ సినిమాలోది..? అన్న‌టువంటి ప్ర‌శ్న‌ల‌కు పూర్తి వివ‌రాల విష‌యానికొస్తే..

టాలీవుడ్ యంగ్ అండ్ డైన‌మిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన అర్జున్‌రెడ్డి ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుందో తెలిసిందే. దీంతో ఈ చిత్రం క‌థ దాదాపు అన్ని సినీ ఇండ‌స్ట్రీల‌ను చుట్టేసింది. ఇప్ప‌టికే కోలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో రూపొంద‌గా, మిగిలిన చిత్ర సీమ‌ల్లోనూ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా క‌బీర్ సింగ్ టైటిల్‌తో అర్జున్‌రెడ్డి తెర‌కెక్కింది. ఈ సినిమా రిలీజైంది మొద‌లు త‌న సినీ కెరీర్‌లో ఏ చిత్రం సాధించ‌ని క‌లెక్ష‌న్ల‌ను ఈ చిత్రం కొల్ల‌గొట్టింది. అలాగే, నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన జెర్సీ హిందీ రీమేక్‌లో షాహిద్ న‌టిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ స్టోరీలు షాహిద్ క‌పూర్‌కు బాగానే కలిసొస్తున్నాయ‌ని సినీ జ‌నాలు అంటున్నారు.

ఇదిలా ఉండ‌గా, షాహిద్ క‌పూర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదే స్టార్ ప్ల‌స్ నిర్వ‌హించిన అవార్డుల ఫంక్ష‌న్. ఆ వీడియోలో షాహిద్ క‌పూర్ త‌న క‌బీర్ సింగ్ సినిమాలో ప‌ని మ‌నిషిని బెదిరించిన‌ట్టు.. ఫంక్ష‌న్‌లోనూ త‌న‌కు నీరు తెచ్చిచ్చిన లేడీని ప‌రుగెత్తించాల‌నుకుంటాడు. కానీ, ప్లాన్ బెడిసికొట్టి సినిమాలో లేడీ పారిపోయిన‌ట్టు పారిపోకుండా.. ఈ స్టేజ్‌పైన ఆ లేడీ ఎదురు తిరుగుతుంది. దాంతో ఏం చేయాలో తెలియ‌ని షాహిద్ క‌పూర్‌కు వెన‌క్కు త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!

Next Story
Share it