రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి

By Newsmeter.Network  Published on  18 Jan 2020 12:09 PM GMT
రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి

బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద లారీ ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారు ముందు భాగం లారీ కింద‌కు దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.

ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయపడిన షబానాను కారు డ్రైవ‌ర్ ను పన్వేల్‌లోని ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రమాద సమయాంలో ఆమె భర్త జావేద్ అక్తర్ సురక్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. కాగా గత రాత్రే షబానా తన భర్త, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు.

Next Story
Share it