సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రూ’. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకుంది. దీంతో చిత్ర బృందం శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న మూవీ యూనిట్‌ సభ్యులు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Whatsapp Image 2020 01 17 At 10.17.40 Amహీరో మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు, కుమారుడితో పాటు సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్, నిర్మాత దిల్ రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహేష్ బాబును చూసేందుకు, ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్