పేరుకు బ్యూటీ పార్లర్‌.. లోపల వ్యభిచారం

By సుభాష్  Published on  22 Jan 2020 12:20 PM GMT
పేరుకు బ్యూటీ పార్లర్‌.. లోపల వ్యభిచారం

ముఖ్యాంశాలు

  • 17 మంది సెక్స్ వర్కలు అరెస్ట్

  • పక్కా ప్లాన్ తో పోలీసుల దాడి

పేరుకు మాత్రం బ్యూటీ పార్లర్‌.. లోపల జరిగేది మాత్రం వ్యభిచారం. బ్యూటీ పార్లర్‌ ముసుగులో జరుగుతున్న ఈ సెక్స్‌ రాకెట్‌ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ పట్టణంలో స్పా, బ్యూటీ పార్లర్‌లో ఈ దందా కొనసాగుతోందని తెలుసుకున్న పోలీసులు.. దాడి చేసి 17 మంది వ్యభిచారులను అదపులోకి తీసుకున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న ఈ సెక్స్‌ రాకెట్లపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ బ్యూటీ పార్లర్‌లో జరుగుతున్న భాగోతం బయటపడింది. పక్కా ప్లాన్‌తో పోలీసులే ఓ నకిలీ కస్టమర్‌ను పంపించి ఈ దందాను బట్టబయలు చేశారు. దీంతో పోలీసులు ఈ దందాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు.

సెక్స్‌ రాకెట్‌ బయటపడిందిలా..

ఈ సెక్స్‌ రాకెట్‌ను బయటపెట్టేందుకు పోలీసులు పంపిన ఆ నకిలీ వ్యక్తి వ్యభిచార నిర్వాహకులకు ఫోన్‌ చేసి అమ్మాయి కావాలని చెప్పగా, వారు ఫలానా అడ్రస్‌కు రావాలని చెప్పడంతో ఆ వ్యక్తి పైకి బ్యూటీ పార్లర్‌గా కనిపిస్తున్న ప్లాట్‌ లోకి వెళ్లాడు. లోపల చాలా మంది అమ్మాయిలు కనిపించారు. ఇక నిర్వాహకులు అతడి వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఓ అమ్మాయితో గదిలోకి పంపించారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు క్షణాల్లో వ్యభిచార గృహానికి చేరుకుని తనిఖీలు చేపట్టగా, ఈ దందా బట్టబయలైంది. ఈ సందర్భంగా 17 మంది సెక్స్‌ వర్కర్లను, నిర్వాహకులను అరెస్టు చేశారు. అమ్మాయిలతో వ్యభిచార గృహంలో రాసలీలలు జరుపుతున్న విటులను కూడా అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిర్వాహకులు ఇలాంటి దందాలు ఇంకా ఎక్కడైనా నిర్వహిస్తున్నారా.. ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story