ముంబాయి అంథేరీలో ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్టిస్టులతోపాటు ఓ మైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మహిళ..  ముగ్గురు మహిళలు, ఓ మైనర్‌తో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ సెక్స్‌ రాకెట్‌ను ప్రియా శర్మ అనే మహిళ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ప్రియా శర్మ కండీవలీ ప్రాంతంలో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఏజన్సీ నడిపిస్తున్నట్లు సమాచారం.

దీంతోపాటు ఆమె మరి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యభిచార దందాలో దొరికిన వారిలో ఓ మహిళ నటి, సింగర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆ మహిళ సావదాన్‌ ఇండియా టీవీలో క్రైమ్‌ షోకు హోస్ట్‌ గా పని చేస్తున్నట్లు సమాచారం. మరో మరాఠీ సినిమాతో పాటు సీరియల్లో కూడా నటిస్తోన్నట్లు సమాచారం. ఈ దందాలో ప్రియా శర్మను నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సదరు మహిళ ఇలాంటి దందాలు ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తోందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలో ఇలాంటి సెక్స్‌ రాకెట్లపై పోలీసులు చాలా సార్లు దాడులు నిర్వహించి పలువురిని కూడా అరెస్ట్‌ చేశారు. ఇలాంటి దందాలో పెట్టింది పేరైన ముంబాయి నగరంలో దాడులు ముమ్మరం చేశారు పోలీసులు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.