'అబ్బా ఇక భ‌రించ‌లేను..ఆపు ప్లీజ్‌' - చివ‌ర్లో బిగ్ ట్విస్ట్‌..!

By అంజి  Published on  16 Jan 2020 4:19 AM GMT
అబ్బా ఇక భ‌రించ‌లేను..ఆపు ప్లీజ్‌ - చివ‌ర్లో బిగ్ ట్విస్ట్‌..!

అవును మ‌రీ, ఈ ఆడ‌వారు అవునంటే కాద‌ని, కాదంటే అవున‌ని అర్ధం. అయినా, మ‌న పింగ‌ళి నాగేంద్ర‌రావు చెప్పింది కూడా ఇదే క‌దా..! ఇంత‌కీ ఈ పింగ‌ళి నాగేంద్ర‌రావు ఎవ‌రు..? అన్న డౌట్ మ‌న‌లో చాలా మందికి రావొచ్చు. అదేనండీ ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అని మొట్ట మొద‌ట‌గా చెప్పింది ఈయ‌నే. మిస్స‌మ్మ చిత్రంలో మ‌హాన‌టి సావిత్రిని ఉద్దేశిస్తూ మ‌న పింగ‌ళి నాగేంద్ర‌రావు ఏ ముహూర్తాన ఆ పాట రాశోరో కానీ ఇక అప్ప‌ట్నుంచి ఆ మాట నిరూపిత‌మ‌వుతూ వ‌స్తోంది.

అలా, త‌మ మాట‌ల‌కు అర్థాలే వేరులే అని చెప్పే ఆడ‌వారితో పోల్చితే తానేమీ తీసిపోన‌ని అంటోంది యాంక‌ర్ క‌మ్ న‌టి ర‌ష్మీ గౌత‌మ్. ఈ విష‌యం స్వ‌యాన‌ తాను చెప్పిక పోయినా, ర‌ష్మీ ప‌లికిన మాట‌లు విన్న వారు మాత్రం వేరేలా అర్థం చేసుకుని పొర‌పాటు ప‌డుతున్నారు. దీంతో త‌న మాట‌ల‌కు అర్థం మీర‌నుకున్న‌ది కాదంటూ వాదించ‌డం ర‌ష్మీ వంతైతే.., అవాక్క‌వ‌డం తోటి యాంక‌ర్ల వంతైంది. ఇంత‌కీ ర‌ష్మీ అన్న మాట‌లేంది..? ఆ మాట‌ల వెన‌క దాగిన అర్ధాలేంది..? అస‌లు అర్థం తెలుసుకుని అవాక్క‌యిన తోటి యాంక‌ర్లు ఎవ‌రు..? అన్న విష‌యాలు తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌దివేయాల్సిందే మ‌రీ..!

కాగా, టీఆర్పీ రేటింగే టార్గెట్‌గా బుల్లితెర చానెళ్లు షోలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే శ్రీ‌ముఖి, ర‌వి యాంక‌ర్లుగా ఓ ఛానెల్ కామెడీ నైట్స్ పేరుతో షోను తెరమీద‌కు తీసుకొచ్చింది. తాజాగా ప్ర‌సార‌మైన ఆ షోలో ర‌ష్మీతోపాటు డ్యాన్స్ కొరియో గ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ గెస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చారు. వారి ఇంట్ర‌డ్యూస్ అనంత‌రం రెగ్యుల‌ర్ షో మాదిరిగానే గెస్ట్‌లకు సంబంధించిన సెలెక్టివ్‌ ఫోటోలను చూపుతూ స్టూడెంట్స్ నుంచి కామెంట్స్ రాబ‌ట్టారు. అందులో భాగంగానే రేష్మీకి సంబంధించిన పై ఫోటోను డిస్‌ప్లే చేయ‌గా స్టూడెంట్స్ కంటే ముందుగా యాంక‌ర్ ర‌వి నుంచి క్యూట్, శ్రీ‌ముఖి నుంచి అబ్బో క్యూట్ అన్న కామెంట్స్ వ‌చ్చాయి.

త‌న ఫోటోకు ర‌వి నుంచి వ‌చ్చిన క్యూట్ అన్న‌ కాంప్లిమెంట్‌కు, అబ్బా ర‌వి.. ఇక ఆపు ర‌వీ..అంటూ వాయిస్ బేస్ త‌గ్గించి మ‌రీ స్లో మోష‌న్‌లో ర‌ష్మీ రెస్పాండ్ అవ‌గా, ఓహో అది ఫోటో ఎక్స్‌ప్రెష‌నా..? అంటూ శ్రీ‌ముఖి మ‌ధ్య‌లో ఎంట‌రైంది. చాలు రవి.. ప్లీజ్ ర‌వి.. ఆ జోకులు ఇక భ‌రించ‌లేను ర‌వీ అంటూ ర‌ష్మీ క‌న్‌క్లూజ‌న్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా శ్రీ‌ముఖి, ర‌వి తేరుకున్నారు. దాంతో, ఓహో జోకులు ఆప‌మంటావా..? అంటూ ర‌ష్మీ మాట‌లకు క్లారిటీ తెచ్చుకున్నారు వారిద్ద‌రూ. ఇలా వ‌చ్చీరాని ర‌ష్మీ తెలుగుతో షో ఆద్యాంతం శ్రీ‌ముఖి, ర‌వి బ‌య‌ట‌కు క‌నిపించ‌ని శ‌త్రువుతో యుద్ధం చేశారు. ఏదేమైనా సంద‌ర్భాల‌ను ఎమోష‌న్స్‌తో క‌వ‌ర్ చేయ‌గ‌లం.. మాట‌ల‌తో కాదు..!

Next Story
Share it