సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
By సుభాష్Published on : 5 March 2020 10:52 AM IST

సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పొత్తూరి.. ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలుగా పత్రికా రంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేశారు. అలాగే ఈనాడు, ఆంధ్రభూమి, వార్త పత్రికల్లో పని చేశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన ఆయన నాటి పత్రికలు, మేటి విలువలు లాంటి పుస్తకాలు కూడా రచించారు.
Next Story