సికింద్రాబాద్: జేబీఎస్ బస్టాండ్ వద్ద దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మూడు రోజుల ఆడశిశువును.. బతికుండంగా పాతి పెట్టేయాలని ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌ వారిని గుర్తించాడు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆటో డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే జేబీఎస్‌ బస్టాండ్‌ వద్ద ఇలాంటి సంఘటన జరగడంతో స్థానికలు కూడా..వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల శిశువును..పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story