భారత్‌ కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌లో 127 మంది ఈ మహమ్మారి భారీన పడ్డారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 12రైలు సర్వీసులకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదీల్లో 12 రైల్వే సర్వీసులను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దైన వాటిలో హైదరాబాద్‌-కలబురగి, కరీంనగర్‌-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాబ్‌ రైలు సర్వీసులు ఉన్నాయి.

రైల్వే సర్వీసులు రద్దైన తేదీలు..

క్రమసంఖ్య ట్రైన్‌నెంబర్‌ ఎక్కడ నుంచి ఎక్కడికంటే.. సర్వీస్‌ రద్దైన తేదీలు
1 11201 ముంబై ఎల్‌టీటీ-అజ్ని (23-03-2020, 30-3-2020)
2 11202 అజ్ని- ముంబై ఎల్‌టీటీ (20-3-2020, 27-03-2020)
3 11205 ముంబై ఎల్‌టీటీ-కరీంనగర్‌ (21-03-2020, 28-03-2020)
4 11206- కరీంనగర్‌-ముంబై ఎల్‌టీటీ (22-03-2020, 29-03-2020)
5 11401 ముంబై సీఎస్‌టీ-నాగ్‌పూర్‌ (23-03-2020, 01-04-2020)
6 11402 నాగ్‌పూర్‌- ముంబై సీఎస్‌టీ (22-03-2020, 31-03-2020)
7 11307 కలబురగి- హైదరాబాద్‌ (18-03-2020,31-03-2020)
8 11308 హైదరాబాద్‌- కలబురగి (18-03-2020,31-03-2020)
9 06059 చెన్నై-సికింద్రాబాద్‌ (20-03-2020, 22-03-2020)
10 06060 సికింద్రాబాద్‌-చెన్నై (21-03-2020, 23-03-2020)
11 82841 శాంత్రాగచ్చి-చెన్నై (20-03-2020, 27-03-2020)
12 82842 చెన్నై-శాంత్రాగచ్చి (21-03-2020, 28-03-2020)

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.