కనుగుడ్డుపై టాటూ.. చివరికి ఏమైందంటే..!

By అంజి  Published on  4 March 2020 3:39 AM GMT
కనుగుడ్డుపై టాటూ.. చివరికి ఏమైందంటే..!

నేటి యువత రకరకాల టాటూలు వేసుకొని ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంటారు. అందరిలో ప్రత్యేకంగా కనిపించటం కోసం వెరైటీ టాటూలకై తాపత్రయపడుతుంటారు..

జీవితకాలం ఉండే జ్ఞాపకం పచ్చబొట్టు. ఆ కాలంలో పచ్చబొట్టు, ఈ కాలంలో టాటూ.. పేరు ఏదయినా రెండూ ఒకటే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా పచ్చబొట్లు అదే టాటూలు పొడిపించుకుంటున్నారు. ఒకప్పుడు ఇది కేవలం ఆకుపచ్చ, నలుపు రంగుల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇంక్‌ తో అనేక రంగుల్లో టాటూలు వేయించుకుంటున్నారు. ఇవి.. గ్రీన్‌, రెడ్‌, బ్లాక్‌.. ఇలా ఎనిమిది రంగుల్లో లభిస్తున్నాయి. చీకట్లో మెరిసేలా రేడియం టాటూలు కూడా వేయించుకుని సంబర పడిపోతున్నవాళ్ళు కూడా ఉన్నారు.

Scleral Tattoos

ప్రతీకాత్మక చిత్రం

చాలా వరకూ యూత్ చేతులపై లేదా కాళ్లపై టాటూ వేయించుకుంటారు. ఇతరదేశాల్లో శరీరం లో ఇతర భాగాల్లో కూడా సునాయాసంగా టాటూ పొడిపించేసుకుంటారు. అయితే ఓ యువతి ఏకంగా కనుగుడ్లపైనే పచ్చ బోయించుకుంది. మొదట్లో చాలా అందంగా ఉన్నాయని మురిసిపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ చూపులో తేడా రావడంతో కంటి వైద్యులకు దగ్గరికి పరిగెత్తింది. అప్పటికే ఆలస్యమైపోయింది. ఓ కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. మరోటి రేపోమాపో అన్నట్లుంది.

Scleral Tattoos

పోలండ్‌కు చెందిన మోడల్ అకెగ్జాండ్రా సదోవ్‌స్కా విషాదసౌందర్యగాథ ఇది. ప్రముఖ పాప్ సింగర్ పోపెక్‌ను అనుకరిస్తూ ఆమె కనుగుడ్లపై టాటూ వేయించుకుంది. Scleral tattoos‌గా పిలిచే ఈ ప్రక్రియలో ఇంకుని నేరుగా కనుగుడ్డులోని తెల్లటి భాగంపై ఇంజెక్ట్ చేస్తారు. ఈ రంగు శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది.. వీటి వల్ల కళ్లు నొప్పెడతాయని అయితే మాత్రలు వేసుకుంటే సరిపోతుందని టాటూ ఆర్టిస్ట్ చెప్పాడట. అయితే ఈమె విషయం లో ఆ కలర్ స్ప్రెడ్ అయిపోయంది. దీంతో కంటిలోని టిష్యూ లు దెబ్బతిన్నాయి. మొత్తానికి ఒక కంట చూపు పోవడంతో ఆమ్మాయి మొత్తుకుంటోంది. టాటూలు వేసిన వాడికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నారు.

Next Story