ఏంటిది మస్క్.. సైబర్ ట్రక్ వచ్చేది 2023లోనే అట..!

Tesla Cybertruck production delayed to 2023.ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన కంపెనీ 'టెస్లా' నుండి ఎంతో

By M.S.R  Published on  27 Jan 2022 11:43 AM IST
ఏంటిది మస్క్.. సైబర్ ట్రక్ వచ్చేది 2023లోనే అట..!

ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన కంపెనీ 'టెస్లా' నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైబర్‌ట్రక్' ఉత్పత్తి ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 2022లో ఈ వాహనం అందుబాటులోకి వస్తుందని భావించగా.. ఆలస్యం అయ్యేలా ఉంది. 2023లో ఈ వాహనం అందుబాటులోకి రావచ్చు. టెస్లా CEO ఎలోన్ మస్క్ బుధవారం నాడు ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ ఏడాది ఈ వాహనం డెలివరీలు జరగవని తెలిపారు. "సైబర్‌ట్రక్, సెమీ, రోడ్‌స్టర్ లను వీలైనంత త్వరగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. వచ్చే ఏడాది తప్పకుండా మీ ముందు ఉంటాయి" అని మస్క్ అన్నారు. టెస్లా ఇటీవల తన వెబ్‌సైట్ నుండి సైబర్‌ట్రక్ ఉత్పత్తికి సంబంధించిన తేదీలను తొలగించింది. టెస్లా యొక్క సైబర్‌ట్రక్ సైట్‌లోని ఆర్డర్ పేజీ లో ముందు "2022లో ఉత్పత్తి సమీపిస్తున్నందున మీరు మీ కాన్ఫిగరేషన్‌ను పూర్తి చేయగలుగుతారు." అని ఉండగా.. ఇప్పుడు సంవత్సరాన్ని తీసేశారు.

సైబర్‌ట్రక్ వాహనం 2019లో ప్రకటించబడింది. ఆగస్టు 2021లో సైబర్‌ట్రక్ 2022 లో అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపింది. టెస్లా తన మోడల్ Yని ఉత్పత్తి చేయడంపై కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇటీవల నవీకరించబడిన డిజైన్‌తో కొత్త టెస్లా సైబర్‌ట్రక్ ప్రోటోటైప్ కనిపించింది. ఫ్రీమాంట్ ఫ్యాక్టరీ టెస్ట్ ట్రాక్ లో ఇది కనిపించింది. ఆటో-టెక్ వెబ్‌సైట్ ఎలెక్ట్రెక్ ప్రకారం, ప్లాంట్ వెనుక ఉన్న టెస్ట్ ట్రాక్‌లో యూట్యూబర్ డ్రోన్ కొత్త సైబర్‌ట్రక్ ప్రోటోటైప్‌ను గుర్తించింది. కొత్త ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును పరీక్షిస్తున్న 10 నిమిషాల ఫుటేజీని వారు క్యాప్చర్ చేయగలిగారు. ప్రోటోటైప్ సరికొత్తగా కనిపిస్తుంది. కొత్త సైబర్‌ట్రక్‌లో సైడ్ మిర్రర్‌లు కూడా ఉన్నాయి, ఇంతకు ముందు చూపించిన ప్రోటోటైప్‌లో ఇవి లేదు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ ట్రక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.

Next Story