అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8

Samsung Galaxy Tab A8 Price Specifications Leak Online. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా ఈ టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్‌లు,

By M.S.R  Published on  13 Dec 2021 4:00 PM IST
అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా ఈ టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుండి కొత్త టాబ్లెట్ Galaxy Tab A8 10.5 moniker తో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. టాబ్లెట్ Unisoc టైగర్ T618 SoCని కలిగి ఉంటుందని, 7,040mAh బ్యాటరీతో రానుంది. ఈ ట్యాబ్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరాను, వెనుక భాగంలో ఫ్లాష్ లేకుండా 8-మెగాపిక్సెల్ కెమెరాను తీసుకుని ఉంచనున్నారు.

రాబోయే Samsung Galaxy Tab A8 యొక్క విభిన్న వేరియంట్‌ల ధరలు కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. కొత్త టాబ్లెట్‌లో Wi-Fi-మాత్రమే, Wi-Fi + LTE మోడల్‌లు ఉంటాయి. 32GB మరియు 64GB RAM కలిగిన Wi-Fi-మాత్రమే ఉండే మోడల్‌ల ధర EUR 270 (దాదాపు రూ. 23,000) కాగా 128GB మోడల్ ధర దాదాపు రూ. 30,700 ఉండొచ్చని భావిస్తున్నారు. Wi-Fi + LTE 32GB మోడల్ ధర EUR 320 (దాదాపు రూ. 27,300) మరియు 128GB వేరియంట్ ధర EUR 410 (దాదాపు రూ. 35,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy Tab A8 క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. రెండు దిగువన, రెండు ఎగువన ఉంటాయి. వాల్యూమ్ కీ, పవర్ బటన్, సెల్ఫీ కెమెరా, లైట్ సెన్సార్ మరియు మైక్రోఫోన్ కుడి వైపు అమర్చబడి ఉంటాయి. లైట్ సెన్సార్ మరియు USB టైప్-C పోర్ట్ దిగువన ఉంచబడ్డాయి. టాబ్లెట్‌లో 3.5mm ఆడియో జాక్ లేదు. ఎడమ వైపు మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంచబడుతుంది. GPS యాంటెన్నా, ప్రధాన యాంటెన్నా, ప్రైమరీ కెమెరా వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి.

Samsung Galaxy Tab A8 స్పెసిఫికేషన్‌లు (అంచనా)..

ఈ ట్యాబ్లెట్ ను Samsung Galaxy Tab A8 10.5 అని పిలుస్తాము. ఇది గ్రే, రోజ్ లేదా పింక్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని చెప్పబడింది. ఇది జనవరి 2022 ద్వితీయార్థంలో అందుబాటులోకి రావచ్చు. ట్యాబ్లెట్ 10.50-అంగుళాల LCD (1,920x1,200 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. రాబోయే గెలాక్సీ ట్యాబ్ 3GB లేదా 4GB RAMతో పాటు Unisoc టైగర్ T618 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుందని తెలుస్తోంది.. 32GB, 64GB లేదా 128GB తో రానుండగా.. స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరణ చేసుకోవచ్చు. Galaxy Tab A8 10.5 వెనుక భాగంలో ఫ్లాష్ లేకుండా 8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉండవచ్చు. సెల్ఫీల కోసం, ఇది 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. టాబ్లెట్ 7,040mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇది నాలుగు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లతో వస్తుందని తెలుస్తోంది.

Next Story