చెఫ్‌ రోబోలు వచ్చేస్తున్నాయ్..ఘుమఘుమలాడే వంటలు రెడీ!

ఆహారాన్ని నములుతూ.. రుచిని అంచనా వేసే రోబోలను కొనుగొన్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2023 6:33 PM IST
Robot Chef, Cooking, Taste

చెఫ్‌ రోబోలు వచ్చేస్తున్నాయ్..ఘుమఘుమలాడే వంటలు రెడీ! 

టెక్నాలజీ పెరుగుతోంది. మానవులు రోజూ ఏదో ఒక విషయాన్ని కనిపెడుతున్నారు. మనం చేసే పనులను సులభతరం చేసేందుకు యంత్రాలను కనిపెట్టారు. ఇప్పుడు అందరూ ఇంట్లో చేసే పనుల నుంచి దాదాపు అన్నింటికీ యంత్రాలనే యూజ్‌ చేస్తున్నారు. మానవుడు సృష్టించిన వాటిలో అద్భుతం రోబో. మనం చేయాల్సిన పనిని ఈ రోబోలు చకచక చేసేస్తాయి. అయితే.. ప్రోగ్రామ్‌ చేసిన వరకే రోబోలు పనిచేస్తాయి. అన్నింట్లో రోబోలు సాయంగా ఉన్నా.. వంటలు మాత్రం చేయలేదు. కానీ.. ఇప్పుడు ఆ రోబోలు చెఫ్‌లుగానూ అవతారమెత్తుతున్నాయి.

రుచిని చూడటం.. ఎలా ఉందని చెప్పడంలో మనిషికి మాత్రమే తెలిసిన విద్య. కానీ.. రోబోలు కూడా ఈ పని చేస్తున్నాయి. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి అనుంబంధంగా ఉన్న బయో ఇన్‌స్పైర్డ్‌ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు అద్బుతాన్ని సాధించారు. ఆహారాన్ని నములుతూ.. రుచిని అంచనా వేసేరోబోలను కొనుగొన్నారు. మనం ఆహారాన్ని నమిలితే మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఆ ఆధారంగానే టేస్ట్‌ ఎలా ఉందని చెబుతాం. సరిగ్గా ఈ సూత్రానే రోబోలు కూడా అలవాటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధ సాయంతో వంట ఎంత రుచిగా ఉందో.. ఎంత చప్పగా ఉందో చెప్పేస్తాయి. ఈ సాంకేతికతను 'బెకో' అనే కంపెనీ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులకు అందించింది.

చెన్నైకి చెందిన రోబో చెఫ్‌ అనే స్టార్టప్ రోబోను రెడీ చేసింది. ఈ రోబో ఏకకాలంలో 600 మందికి వండగలదు. ఈ రోబో కిచెన్లు, రెస్టారెంట్లకు పనికొస్తుంది. ఒకేసారి 100 రకాల కూరగాయలను ఉడికించగలదు. కూరగాయల కటింగ్, మసలాను దంచడానికి, సరైన నిష్పత్తిలో కూరల్లో వేసేలా ఈ రోబోను చెన్నైకి చెందిన శరవణన్ సుందరమూర్తి అనే ఇంజిర్‌ ప్రోగ్రామ్ చేశాడు.

గతంలో స్పేస్‌ ఎక్స్‌ బృందంలో పనిచేసిన బెన్సన్‌ అనే ఇంజినీర్‌ స్టెల్లార్‌ పిజ్జా అనే స్టార్టప్‌కు ప్రాణం పోశాడు. ఈ సంస్థ రూపొందించిన రోబో నిమిషానికి ఒక పిజ్జా తయారు చేస్తుంది. ఇలాంటి రోబోల వల్ల మనుషులకు పని చేసే శ్రమ తప్పుతున్నా.. కొందరికి ఉపాధి లేకుండా చేస్తున్నాయి. దీంతో.. పనులు లేక రోడ్డున పడుతున్నారు.

Next Story