మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న సేవలు

Microsoft Teams Will Stop Working on Internet Explorer ... ఇది మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూసే. అత్యంత ప్రజాదరణ

By సుభాష్  Published on  30 Nov 2020 9:15 AM GMT
మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న సేవలు

ఇది మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూసే. అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్‌ వెబ్‌ యాప్ నిలిచిపోనుంది. నవంబర్‌ 30 (ఈ రోజు) నుంచి మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌లో తన మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ వెబ్‌ యాప్‌కు సపోర్టును నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఒకవేళ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఉపయోగించాలని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌లో టీమ్స్‌ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది.

కొత్తగా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌

కాగా, 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ఫ్లోరర్‌ 11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2021,మార్చి 9 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌యాప్‌ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందలేదని స్పష్టం చేసింది. ఇందుకు కొత్త మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ కొత్త విండోస్‌ ఫీచర్‌ అప్‌డేట్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. క్రోమ్‌ బ్రౌజర్‌ మాదిరిగానే ఇది కూడా వేగంగా పని చేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌ 1995 ఆగస్టులో విడుదల కాగా, ఈ సేవలు నిలిపివేస్తూ కొత్త బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Next Story
Share it