భారత్‌లో జియో 5జీ సేవలను 2021లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. మంగళవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. జియో అందించే 5జీ సేవలు మోదీ సర్కార్ ఆత్మనిర్బర్ భారత్ విధానానికి ఓ సాక్షీగా నిలుస్తుందన్నారు. దేశంలో 5జీ సేవలతో పాటు గూగుల్‌తో కలిసి అతి తక్కువ ధరకు ఆండ్రాయిడ్ ఫోన్‌ను తీసుకొచ్చే ఆలోచనలో కూడా జియో ఉందన్నారు. దేశంలో 5 జీ సేవలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి విధాన నిర్ణయాలు ఎంతో అవసరమైన ముకేష్ అంబాని అభిప్రాయపడ్డారు. దేశంలో అభివృద్ధి నెట్ వర్క్, హార్డ్‌వేర్, సాంకేతిక పరికరాలతోనే జియో తన 5జీ సేవలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
5జీ సేవలు అందించడానికి చాలా రోజుల కిందట నుంచే జియో ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. దీని కోసం శామ్‌సాంగ్, క్వాల్‌కామ్ కంపెనీలతో జియో కలిసి పని చేస్తోంది. కాగా, స్పెక్ర్టమ్ అందుబాటులోకి రాగానే 5జీ సేవలు అందించే దిశగా జియో పని చేస్తుందని జూలై నెలలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ముకేశ్ వెల్లడించారు.