వినియోగదారుల సౌకర్యం కోసం వారి ఖాతాలో జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌లోని క్రియా రహితంగా, పరిమితికి మించి ఉన్న వాటి కోసం టెక్ దిగ్గజం గూగుల్ కొత్త పాలసీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వచ్చే ఈ కొత్త పాలసీ వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. గూగుల్ పాలసీతో డ్యాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్లు, జూమ్ బోర్డు ఫైల్స్, ఫోటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్దతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనట్లయితే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్ తొలగించనుంది.
మీ స్టోరేజీ రెండేళ్లు దాటినట్లయితే..
ఇక మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్, డ్రైవ్, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని సంస్థ తెలిపింది. మేమేదైనా కంటెంట్ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని, అందువల్ల మీరు ఆలోపే స్పందించే అవకాశం ఉంటుందని గూగుల్ పేర్కొంది. మీ ఖాతాను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు జీమెయిల్, డ్రైవ్, ఫోటోలను చూస్తూ ఉండాలని గూగుల్ సూచించింది. అయితే సైన్ఇన్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని గూగుల్ ఒక రికార్డు చేసుకుంటుందని వెల్లడించింది. ఇన్క్టివ్ ఖాతాల్లో ఉన్న డేటాను తొలగిస్తామని స్పష్టం చేసింది. దీని వల్ల ఇనాక్టివ్ ఖాతాలు నిర్వహించేందుకు మీకు సహాయ పడుతుందని వెల్లడించింది