గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగించింది. వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్ప కాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి రుణాలు తీసుకున్న వారిని వేధించాయి. తమ గూగుల్ ప్లే స్టోర్ డెవలపర్ విధానాలు వినియోగదారులను కాపాడడానికి వారిని సురక్షితంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా,ప్రజలకు త్వరగా నగదు అవసరమైనప్పుడు అందించడానికి లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి గుర్తింపు లేని యాప్స్ పెరిగిపోయాయి. అయితే ఈ యాప్స్ పేర్లు కూడా గుర్తింపు ఉన్న కంపెనీల పేర్లతో పోలి ఉండటంతో ప్రజలకు వీటి మధ్య ఉన్న తేడా పెద్దగా తెలియడం లేదు. వీటిని కనీసం 4,00,000 నుంచి 1 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు అని ఫిన్‌టెక్ పరిశోధకులు చెబుతున్నారు. కనీసం ఇలాంటి పది యాప్స్‌లను అధ్యయనం చేసినట్లు చెబుతున్నారు. ఇక గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన వాటిలో ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిఫ్ క్యాష్,ఈ క్యాష్, స్నాప్ ఇట్ లోన్ యాప్స్ ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వాటి నుంచి కాపాడేందుకు తమ ఆర్థిక సర్వీసుల విధానాలను విస్తరించినట్లు పేర్కొన్నారు. ఈ యాప్స్ ఫీచర్లు కూడా మన దేశ చట్టాల పరిధిలోకి రావు. కాబట్టి ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే తొలగించండి.