మనుషుల మధ్యే ఏలియన్లు.. హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన విషయాలు
ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 3:20 PM ISTమనుషుల మధ్యే ఏలియన్లు.. హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన విషయాలు
ఇన్నాళ్లు ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే. ఏకంగా భూమి మీద అదికూడా మనుషుల మధ్యే ఏలియన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏలియన్స్ కి ఒక నిర్దిష్టమైన రూపం ఉండదని అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రూపం మార్చుకుని మనుషుల మధ్యే రహస్యంగా నివసిస్తుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏలియన్స్‌కు సంబంధించి యూఎఫ్‌వోలపై ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌లో పరిశోధనలను శాస్త్రవేత్తలు ఈ విధంగా ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భం లోపల.. అలాగే చంద్రుడిపై నివసిస్తూ ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే.. రూపం మార్చుకుని మనుషుల మధ్య కూడా జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. భూమిపై నివసించే వారి కోసం ఫ్లయింగ్ సాసర్లు వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. అయితే.. ఈ మూడు విషయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ అంచనా వేసింది కానీ.. ఆధారాలను బయటపెట్టలేదు.
కొద్దిరోజుల ముందు ఇంగ్లండ్‌కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో మహిళ పూర్తిగా వైట్ స్కిన్‌తో ఉంది. ఏలియన్‌లా కనిపించింది. అలాగే.. ఆమె చేతులు కూడా సాధారణంగా లేవు. ఆమె ఆకాశం వైపు ఫోన్ కెమెరా ఉంచి.. ఫొటోలను తీసింది. మిగతా వారు ఆమెను వింతగా చూస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. మరి వీడియోలో కనిపించింది మనిషేనా? లేక ఏలియనా? తెలియలేదు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పిన విషయాలతో ఆ వీడియో గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే అనే భావిస్తున్నారు.