దాదా @ బీసీసీఐ కా న‌యా 'బాస్'

By Medi Samrat  Published on  14 Oct 2019 8:26 AM GMT
దాదా @ బీసీసీఐ కా న‌యా బాస్

భార‌త జ‌ట్టు మాజీ సార‌థి సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. గంగూలీకి పోటీదారునిగా భావించిన బ్రిజేష్‌ పటేల్‌ అనేక చర్చల అనంతరం పోటీ నుంచి తప్పుకొన్నాడు. అయితే, శ్రీనివాసన్‌ వర్గీయుడైన బ్రిజేష్ కు ఐపీఎల్‌ చైర్మన్‌ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

అయితే.. బీసీసీఐ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం ఆఖరి రోజు. కాగా, పోటీ లేకుండా కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ఇప్పటికే చర్చలు జ‌రిగాయి. దీంతో 47 ఏళ్ల గంగూలీ బీసీసీఐ కొత్త బాస్‌గా ఎన్నికవడం లాంఛనమయ్యింది.

ఇదిలావుంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కమారుడైన జై షా కార్యదర్శిగా, బోర్డు మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు.

Next Story