ఈ ఏడాది ఆయ‌న జీతం అక్ష‌రాల రూ. 305 కోట్లు!

By Medi Samrat  Published on  18 Oct 2019 9:02 AM GMT
ఈ ఏడాది ఆయ‌న జీతం అక్ష‌రాల రూ. 305 కోట్లు!

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ క్యాపిటలైజేషన్ విషయంలో 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. అందుకు తగ్గట్టుగానే సంస్థ‌ సత్య నాదెళ్లకు భారీ‌గా ఇంక్రిమెంట్ ఇచ్చింది.

సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం… సత్య నాదెళ్లకు ఈ ఏడాది ఏకంగా 66 శాతం ఇంక్రిమెంట్ లభించింది. మైక్రోసాఫ్ట్ వార్షిక నివేదిక ప్ర‌కారం 2018-19 సంవత్సరానికి సత్య నాదెళ్లకు 42.9 మిలియన్ డాలర్లు (రూ. 305 కోట్లు) వేతనం లభించింది. గడిచిన రెండేళ్లలో ఆయన వేతనం రెండింతలైనట్లు తెలుస్తోంది. 2016-17 లో సత్య నాదెళ్ల 20 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకోగా.. 2017-18కి 25 మిలియన్ డాలర్లు అందుకున్నారు.

ఇదిలావుంటే.. సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరుణంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 బిలియన్ డాలర్లు కాగా.. 2018 సెప్టెంబర్ 4 నాటికి దాన్ని 850 మిలియన్ డాలర్లకు తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటరింగ్‌లో సత్య నాదెళ్ల వ్యూహం సంస్థకు మరింత లాభం చేకూర్చింది.

Next Story